శేరిలింగంపల్లి, జూన్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని కొండాపూర్ డివిజన్ కొత్తగూడ బస్తీ దవాఖానాలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రక్తపు జంగం గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. చిన్నారుల మెరుగైన భవిష్యత్తుకు పోలియో చుక్కలను వేయించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.






