ఉప్పల్ మినీ శిల్పారామంలో కూచిపూడి నృత్య వైభవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం ప్రముఖ నృత్య గురువు యశ్వంత్ దీక్షిత్ శిష్యబృందం అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులు శ్రీ గణపతిం సేవింపరారే, వినాయక కౌతం, జతిస్వరం, బ్రహ్మాంజలి, జనుత శబ్దం, స్వాగతం కృష్ణ, రామాయణ శబ్దం, గరుడ గమన, హనుమాన్ చాలీసా, తిల్లాన, తరంగం, అష్టలక్ష్మీ స్తోత్రం వంటి వైవిధ్యభరిత నృత్యాంశాలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శిష్యులు శ్రీనిక, అనయశ్రీ, రిషిత, హాన్విక, నిషిక, హాసవిత, ఆరాధ్య, మనోజ్ఞ, సమీక్షా, మనస్విని, అమూల్య, యశస్వి తదితరులు తమ నృత్య ప్రతిభతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారాంతపు సాంస్కృతిక వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కూచిపూడి ప్రదర్శనకు సందర్శకులు విశేషంగా స్పందించి కళాకారులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here