శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజ్ లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజ్ సమస్య కారణంగా స్థానికులు చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త యూజీడీ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. డ్రైనేజ్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, కాలనీవాసులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాలనీవాసులు శేషగిరిరావు, సూర్యదేవర శ్రీనివాస్‌రావు, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






