అట్టేపల్లి రామప్రభు 9వ శనివారపు మహా అన్నదానం

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో శనివారం 9వ వారపు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను కూడా నిర్వహించి వందలాది మందికి వైద్య సేవలు అందించారు. అన్నదానం మహాదానం – ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ రెండు సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహా అన్నదానంలో వందలాది మంది నిరుపేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, స్థానికులు అన్నప్రసాదం స్వీకరించారు. ఉచిత మెడికల్ క్యాంప్‌లో వందలాది మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని నిపుణులైన వైద్యుల సలహాలు పొందడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా అందుకున్నారు.

ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సమాజ సేవే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని, ప్రజల ఆశీర్వాదంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాండు, రవి, శ్రీరాములు, సోమేశ్వర్, దయాకర్, వేణు, సాయి, శ్రీనివాస్, శ్రీరామ్, తేజ, రాంచరణ్, ఏఆర్పీ టీమ్ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, వైద్య బృందం, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here