గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, జూన్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లింగంపల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ వ్య‌క్తి మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి వ‌య‌స్సు సుమారు 30 నుంచి 35 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని, అత‌ని వివ‌రాలు తెలియ‌వ‌ని, ప‌సుపు-నీలం రంగు గీత‌ల షర్ట్‌, జీన్స్ ప్యాంట్ ధ‌రించి ఉన్నాడ‌ని, అత‌ని త‌ల‌పై గాయాలు ఉన్నాయ‌ని, బ‌హుశా అత‌ను అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు స‌రైన ఆహారం అంద‌క మృతి చెంది ఉంటాడ‌ని భావిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here