శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక నివాసం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పాల్గొని భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ, లేబర్ సెల్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు నల్ల సంజీవ రెడ్డి, వీరమల్ల వీరేందర్ గౌడ్, వుయ్యూరు శ్రీదేవి, ముద్దంగుల తిరుపతి, మాదిరెడ్డి మోహన్ రెడ్డి, వుయ్యూరు రామారావు తదితరులు భట్టి విక్రమార్కకు గజమాలలు వేసి, శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.






