శేరిలింంగపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింంగపల్లి): వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మాటుగూడెం గ్రామంలో ఈ నెల 13న జరగనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. భవన కార్మికుల సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. అనంతయ్య నివాసం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బహుజనుల ఆరాధ్యదైవం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు ఉప్పరి కృష్ణయ్య, భవన కార్మికుల సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. అనంతయ్య, తెలంగాణ రాష్ట్ర బి.ఆర్. అంబేద్కర్-బాబు జగ్జీవన్ రామ్ జయంతుల ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గంట సుదర్శన్, ఓయూ విద్యార్థి నాయకుడు ఎం. కుమార్, అరుణ్ కుమార్, నాగరాజు, లక్ష్మీదేవిపల్లి గోవు సత్యనారాయణ యాదవ్, శ్రీనివాస్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మాటుగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బేరి రామచంద్ర యాదవ్‌తోపాటు నిర్వాహక కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.





