శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. కార్యక్రమ స్థలం, సభా ప్రాంగణ ఏర్పాట్లను తనిఖీ చేసిన ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ చరిత్రలో ఒకే రోజు రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CMC కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డీసీలు బాలకృష్ణ, సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






