శేరిలింగంపల్లిలో SIRపై బీజేపీ ఫోకస్

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై బీజేపీ నేతలు సమీక్ష నిర్వహించారు. మియాపూర్‌లోని భూమి బాంకెట్ హాల్‌లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర SIR కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరులైన ఓటర్లందరి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాలని పార్టీ బీఎల్‌ఏలకు సూచించారు. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు బూత్‌లలో నమోదై ఉంటే, ఆగస్టు 3 తర్వాత ఫామ్-8 ద్వారా ఒకే బూత్‌లోకి మార్చే చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల నమోదు, నియోజకవర్గ పరిధిలోకి ఓటు బదిలీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, పోటీ చేయాలనుకునే నాయకులందరూ తమ తమ డివిజన్లలో బీఎల్‌ఏలకు అందుబాటులో ఉంటూ పూర్తి సహకారం అందించాలని కోరారు. బీఎల్‌ఏలు లేని బూత్‌లలో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా పర్యటించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొండాపూర్‌లో 43.15 శాతం, లింగంపల్లిలో 43.38 శాతం, భారతి నగర్‌లో 45.12 శాతం, గచ్చిబౌలిలో 44.61 శాతం, మాదాపూర్‌లో 43.64 శాతం, చందానగర్‌లో 45.79 శాతం, మియాపూర్‌లో 41.95 శాతం, హఫీజ్‌పేట్‌లో 42.35 శాతం, హైదర్‌నగర్‌లో 44.01 శాతం, ఆల్విన్ కాలనీలో 43.53 శాతం, వివేకానంద నగర్‌లో 45.48 శాతం, పాపిరెడ్డి నగర్‌లో 43.07 శాతం మేర ఎన్యూమరేషన్ ఫార్ములు అధికారులకు అందజేశారు. మొత్తం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 44 శాతం, అంటే 3,37,887 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫార్ములు సమర్పించబడినట్లు నేతలు తెలిపారు.

ప్రతి రోజు బీఎల్‌వోలు వద్ద నుంచి ఎన్ని ఫార్ములు తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుని నాయకత్వానికి నివేదించాలని సమావేశంలో బీఎల్‌ఏలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోన్-3 ఇన్‌చార్జి ఇంద్రసేన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజిత్, రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరావు, జిల్లా ఇన్‌చార్జి ఆలే భాస్కర్, బీఎల్‌ఏ-1 మాణిక్‌రావు, అశోక్ కురుమ, అనిల్ గౌడ్, భాస్కర్ రెడ్డి, వసంత్ యాదవ్, రామరాజు, సీతారామరాజు, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here