భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు..

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం, జాతర మహోత్సవాల‌ను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తుల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే ఈ పవిత్ర మహోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరిపై శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థించారు.

కన్నుల పండువగా జరిగిన కల్యాణోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పలువురు ఛైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here