శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల హుడా కాలనీలో ఉన్న ది మాస్టర్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను 100 అడ్మిషన్లు సాధించి మరో మైలురాయిని అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. 100 అడ్మిషన్ల మైలురాయిని చేరుకోవడం వెనుక పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్టి కృషి ఉందని కొనియాడారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలను అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన రాగం నాగేందర్ యాదవ్, పాఠశాల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాస్టర్మైండ్స్ స్కూల్ ఛైర్మన్ రాజు సంగని, డైరెక్టర్లు శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, హరి, రాజ్ కిరణ్, ప్రిన్సిపాల్ కావ్య, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





