శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కృష్ణ మోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.






