రెండు ప్ర‌పంచ రికార్డుల‌ను సాధించి స‌త్తా చాటిన అశ్విక గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మెద‌క్ జిల్లా రామాయంపేట ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, రాష్ట్ర పీసీసీ అధికార ప్ర‌తినిధి ప‌ల్లె రామ‌చంద్రం గౌడ్ మ‌న‌వ‌రాలు అశ్విక గౌడ్ (3) వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండ‌న్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్స‌లెన్సీ రెండు ప్ర‌పంచ రికార్డుల‌ను చెస్ పోటీల్లో సాధించింది. 120 టేబుల్స్ చెస్ 8 నిమిషాల 56 సెకండ్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేసింది. వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స‌ర్టిఫికెట్‌ను ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా అందుకుంది. అలాగే మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చిన్నారిని అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, జ‌గ‌దీష్ గౌడ్‌, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఆంజ‌నేయులు గౌడ్ తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here