శేరిలింగంపల్లి, మే 30 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో నుంచి డబ్బు తీసుకుని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని వేముకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ షైబాజ్ అలీ (23) ఈ నెల 9న సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లోని అల్మారాలో నుంచి రూ.20వేలు తీసుకుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లాడు. అనంతరం అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన షైబాజ్ అలీ ఎత్తు సుమారు 5 అడుగులు, గుండ్రని ముఖం, నలుపు వర్ణం కలిగి ఉంటాడు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో నల్ల రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షైబాజ్ అలీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే చందానగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.






