కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దివంగత కట్ల మల్లా రెడ్డి స్మారకార్థం కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజ‌య‌వంతంగా ముగిసింది. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో కట్ల మల్లా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యతాభావాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌కు పలువురు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, అతిథులు హాజరై కట్ల శేఖర్ రెడ్డి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ కట్ల శేఖర్ రెడ్డి విజయవంతంగా టోర్నమెంట్ నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జీవితంలో విజయాల దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధి, సాధికారత, సంక్షేమం కోసం ఆయన మరిన్ని సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here