శేరిలింగంపల్లిలో ఘనంగా రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జ్ ఎం. రవికుమార్ యాదవ్ కి బీజేపీ నాయకులు, యువకులు భారీ ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలిగిరి అర్జున్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి, రవికుమార్ యాదవ్ సేవలను కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని, యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, అఖిల్, సాయిరాం, చరణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here