డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డిగ్రీ కళాశాలల పేద విద్యార్థుల కోసం 2026-27 విద్యాసంవత్సరానికి శ్రీరామకృష్ణ వివేకానంద సేవాసమితి, KPHB-మియాపూర్ ఆధ్వర్యంలో ఉపకారవేతనాల పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నెలవారీ ఉపకారవేతనాలు అందించడంతోపాటు ఆంగ్ల వ్యాకరణ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం, సంగణన విజ్ఞానశాస్త్రం అంశాలలో “యువ వికాస్” పేరిట ప్రత్యేక ఆదివారం శిక్షణా తరగతులను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి–మియాపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన డిగ్రీ విద్యార్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఆసక్తి గల విద్యార్థులు ముందుగా వాట్సాప్ సందేశం ద్వారా వినతిపత్రం పంపించి, అనంతరం ముందస్తు సమాచారం ఇచ్చి ఆదివారం ఉదయం సమయంలో అర్హతా పత్రాలతో కలిసి సంప్రదించాలని సూచించారు. శ్రీరామకృష్ణ వివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ నెం.166, రాధామాధవ్ అపార్ట్‌మెంట్ జంక్షన్ సమీపంలో, ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ, మియాపూర్ అనే చిరునామాలో సంప్ర‌దించాల‌ని అన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 9346761610 అనే ఫోన్ నంబ‌ర్ లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here