శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ ని యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.రఘునాథ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నాను. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా, పోలీసు వ్యవస్థకు సామాన్యులకు మధ్య వారధిలా ఉంటూ తమ వంతు సహకారం అందించడంపై ప్రత్యేకంగా చర్చించారు.






