శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు, స్థానిక కవులు, తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షుడు మోటూరి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు అరవా, ఉపాధ్యక్షుడు జె.వి.కుమార్ చేపూరి, ప్రముఖ కవి, రచయిత, దర్శకుడు గూండ్ల నారాయణ తదితరులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో గౌరవ ప్రదంగా కలిసి సత్కరించారు.






