శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఇష్టారీతిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలు, వాల్ పోస్టర్లతోపాటు వాల్ రైటింగ్‌లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ లు, కాలనీలు, పార్క్‌లు, కూడలిల సుందరీకరణ పనులు చేపట్టి కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఒక పక్క నిర్మిస్తుంటే మరో పక్క నుంచి అంద విహీనంగా మారుస్తూ రావడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. జీవో కాపీని జతచేస్తూ అవసరమైన చోట జరిమానాలు విధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులను కాపాడడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజామ్, నాగరాజు, NSUI మౌళి పాల్గొన్నారు.






