సమత నగర్ కాలనీ పార్క్ లో వీధి దీపాల ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, మే 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ పార్క్ లో రూ.2 లక్షల 20 వేల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని స్విచ్ న్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వీధి దీపాల ఏర్పాటు ద్వారా కాలనీ వాసులకు , పార్క్ లో రాత్రి వేళ నడకకు వచ్చేవారికి చీకటి సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంద‌ని తెలిపారు. సమత నగర్ కాలనీ పార్క్ కు కొత్త శోభ వచ్చింద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here