శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీ లో ఉన్న గాంధీ పార్క్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్బంగా హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ ప్రతాప్ మహారాజ్ హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ, హిందూ సమ్మేళనాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. పంచపరివర్తన్ అనే ఐదు ముఖ్యమైన జీవన సూత్రాలు సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పౌర విధులు, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ.. ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు.

గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, హిందూ సమ్మేళనాలు సమాజంలో ఐక్యతను పెంపొందించే గొప్ప వేదికలని తెలిపారు. సనాతన ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది అని, యువత ఈ విలువలను తెలుసుకొని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మహిళా వక్తగా చింతల వీణ హాజరయ్యారు. ముఖ్య వక్తగా నన్నపనేని రాజశేఖర్, గచ్చిబౌలి డివిజన్ ప్రజలు హాజరయ్యారు.





