శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం మాదాపూర్ పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని సిటీ వైన్స్ ఎదురుగా శనివారం ఉదయం 11:20 గంటలకు ఓ వృద్ధుడి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వృద్ధుడి వివరాలు తెలియవని, అతని వయస్సు సుమారుగా 55 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుందని, ఎత్తు 5.6 అడుగులు ఉంటాడని, ఛామన ఛాయ రంగులో ఉన్నాడని, తెల్లని గళ్ల చొక్కా, మెరూన్ కలర్ బనీన్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. బహుశా అతను అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.






