శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్ (Early Bird) ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కమిషనర్ సృజన ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పన్ను వసూళ్లు ఆశాజనకంగా పెరిగాయని అన్నారు. ప్రస్తుత సంవత్సరం వసూళ్లు రూ.510.33 కోట్లు కాగా, గత సంవత్సరం వసూళ్లు రూ.439.85 కోట్లుగా నమోదైనట్లు వివరించారు. గతేడాది ఎర్లీ బర్డ్ వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.70.48 కోట్లు అదనంగా వసూలయ్యాయని, ఇది సుమారు 16 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు.





