కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల‌ను 30వేల‌కు పెంచాలి: సురేందర్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం బీహెచ్ఈఎల్ టౌన్షిప్ లో సుమారు 50 మంది కాంట్రాక్టు పాశుద్ధ్య కార్మికులు, మహిళా కార్మికుల‌ను ప్రత్యేకంగా సన్మానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ తో కలిసి ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ గత 30 నుంచి 40 ఏళ్లుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీవితాలు మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ 10 నుంచి 15 వేల రూపాయలు చెల్లించడం పట్ల సురేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభ్యున్నతి కోసమే పని చేస్తున్నామ‌ని చెబుతున్నాయ‌ని, వారిని సంపన్నులు చేయడమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని అటున్నాయ‌ని, అయితే కాంటాక్ట్ కార్మికులను రోజువారి కూలీ రూ.500 చొప్పున ఇచ్చి బానిసలుగా ప‌ని చేయించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మినిమం వేజ్‌30 వేల రూపాయలు పెంచి తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ లీడర్స్ సంఘం నిరంతరం కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, బాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here