శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జర్నలిస్టు వై. శ్రీనివాస్ యాదవ్ తండ్రి యేషం జగదీష్ యాదవ్ దశదిన కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. గంగారం గ్రామంలోని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో నిర్వహించిన ఈ దశదిన కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడుతూ జగదీష్ యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, యోగా గురువు పుట్ట వినయ్ కుమార్ గౌడ్, బీఎస్ఎన్ సాయి కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, అందేల కుమార్ యాదవ్, రాజేష్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ సిరిపురం హరికృష్ణ చారి, పాములేటి యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యేషం కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






