శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సోమవారం భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో రంగారెడ్డి జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ RTE చట్టాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పేద విద్యార్థుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా హక్కు ప్రతి ఒక్కరికీ అందాలని, పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి, పొనుగంటి సందీప్, శ్రీను, సుబేదా కృష్ణ, లింగం, యాది, మంగు భాయ్, రాణి శర్మ, ఫాతిమా బేగం, జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు.





