తెలంగాణ‌లో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ను శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్బంగా చిర్రా రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా కలిసిన చిర్రా రవీందర్ యాదవ్ ను కేసీఆర్ అభినందించారు. సోమవారం నంది నగర్ లోని ఆయన నివాసంకు వచ్చిన కేసీఆర్ ని చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజర‌య్యేందుకు వెళ్తుండగా కొద్ది సేపు కేసీఆర్ తో మాట్లాడారు. సమావేశానికి ముందు కలిసిన చిర్రా రవీందర్ యాదవ్ ను కేసీఆర్ భుజం తట్టారు. రవీందర్ యాదవ్ చేస్తున్న పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని వెల్లడించారు. కేసీఆర్ ను ప్రజలు మ‌ళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండాను ఎగుర వేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here