శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్, శేరిలింగంపల్లి డివిజన్ పాపి రెడ్డి కాలనీ, మాతృశ్రీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడడం కోసం వాసవి మాత తీసుకున్న నిర్ణయం నేటికీ ప్రజలకు మార్గదర్శకం అని అన్నారు. ఆర్య వైశ్య సమాజాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చిన మహానుభావురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజు, మన్నేపల్లి సాంబశివ రావు, యలమంచి ఉదయ్, మల్లేష్, నాగరాజు, అప్పారావు, అలీ, కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






