శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ని పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు గంగారం సంగారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లో ఉన్న కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసిన సంగారెడ్డి శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రానున్న ఏ ఎన్నికల్లో అయినా సరే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించాలని కేటీఆర్ తెలిపారని సంగారెడ్డి అన్నారు.






