శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పౌరులు మరింత బాధ్యతాయుతంగా మెలగాలని మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ సూచించారు. ఆదివారం సర్కిల్ పరిధిలోని అమీన్‌పూర్ రోడ్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పర్యవేక్షించారు. వ్యాపారులు కచ్చితంగా తమ దుకాణాల ఎదుట డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయాలని, ప్రజలు కూడా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రాకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ (ఎస్‌డబ్ల్యూఎం, ఎస్ఆర్‌పీలు, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.






