మ‌లేరియా ప‌ట్ల ప్ర‌జ‌లు అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీసీ చాముండేశ్వరి, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకుంటార‌ని, ప్రతి ఒక్కరికి మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించడం, దాని నియంత్రణ, నివారణ కోసం అవసరమైన చర్యలను ప్రోత్సహించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు. మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2007 వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో దీనిని స్థాపించింద‌ని అన్నారు. ప్ర‌జ‌లు దోమ‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటే మ‌లేరియా రాకుండా ఆప‌వ‌చ్చ‌ని, వ్యాధి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, గణేష్ ముదిరాజు, మారబోయిన రాజు యాదవ్, అక్తర్, నాయినేనీ చంద్రకాంత్ రావు, దొడ్ల రామకృష్ణ గౌడ్, చిరుమర్తి రాజు, పాలమూరు భాస్కర్ రావు, నాయకులు, కార్యకర్తలు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here