శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల శ్రీవారిని భారాస సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి ఉద్యమ నేత చిర్రా రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను వేద పండితులు చిర్రా రవీందర్ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది భారాస ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగిత్యాల సభతో కాంగ్రెస్ ఓటమి మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే చిత్తు చిత్తుగా ఓడించే పరిస్థితులు ముందు ముందు ఉన్నాయన్నారు. భారాస అధినేత కేసీఆర్ ను మరోసారి ప్రజలు సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని మండిపడ్డారు. భాగ్యనగరం ప్రతిష్టతను దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధే చిరస్థాయిగా నిలుస్తుందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చిర్రా రవీందర్ యాదవ్ పేర్కొన్నారు.






