మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌ధాన ధ్యేయం: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రజలు ఆయ‌న దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్లు, మంచినీటి కనెక్షన్లు, విద్యుత్ సమస్యలు, హౌస్ ట్యాక్స్ సంబంధిత ఇబ్బందులు, అలాగే రాక్ గార్డెన్ పార్క్ అభివృద్ధి, గార్బేజ్ ఎక్విప్‌మెంట్ తొలగింపు వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా కాలనీలోని పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

ఈ అంశాలపై స్పందించిన గంగాధర్ రెడ్డి సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నల్లగండ్ల హుడా కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి సదుపాయాలు, హౌస్ ట్యాక్స్ సమస్యల పరిష్కారం, రాక్ గార్డెన్ పార్క్ అభివృద్ధి, గార్బేజ్ ఎక్విప్‌మెంట్ తొలగింపు, ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. యువత, పిల్లలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ థీమ్ పార్క్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనతోపాటు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే త‌మ లక్ష్యమ‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, ట్రెజరర్ భార్గవ్, జాయింట్ ట్రెజరర్ కృష్ణ మూర్తి, జాయింట్ సెక్రెటరీ శ్రీధర్, సీతారాంబాబు, సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి దొరబాబు, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, సుమన్, ప్రకాశ్, సాయి, విజయ్ భాస్కర్ రెడ్డి, కాశీనాథ్ రెడ్డి, కుమార్, నరసింహులు, ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్, విశ్వనాథం, గోవర్ధన్, నరేందర్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here