ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తులు క‌ల్పించేందుకు కృషి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని టెలికాం న‌గ‌ర్ కాల‌నీలో అధికారులు, స్థానిక కాలనీ సభ్యులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నూతనంగా చేపటాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు మూల వెంకటేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు భరత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ గౌడ్, నాయకులు వెంకటేష్ గౌడ్, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్, మహిళలు సుస్మిత, గిరిజ, అమరావతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here