కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్లతో పోలీసుల స‌మావేశం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని గ‌చ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్ లో ఉన్న iSprout భవనంలో కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్లతో పోలీసులు ఉద్యోగ మోసాల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి డీసీపీ హాజరై ఉద్యోగ మోసాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. కో వర్కింగ్ ప్లేసెస్ రెంట్ కి ఇచ్చేముందు ఎవరికి అద్దెకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ కంపెనీ పూర్వపు చరిత్ర తెలుసుకోవడం, ఆ కంపెనీ ఏ విధమైన ఉద్యోగాలు ప్రజలకు అందిస్తున్నది ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది, ఎంత మందికి ట్రైనింగ్ ఇస్తుంది, ఆ కంపెనీ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా, వారి బ్యాక్ గ్రౌండ్ ను వెరిఫికేషన్ చేయాల‌ని డీసీపీ క్లుప్తంగా సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాదాపూర్ డివిజన్ ఏసిపి, మాదాపూర్ ఇన్స్పెక్టర్, రాయదుర్గం ఇన్స్పెక్టర్, మాదాపూర్ ఎస్సైలు, రాయదుర్గం ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here