శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ నాలా విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే నాలా విస్తరణ పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, SNDP ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AE అరుణ్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాశీనాథ్ యాదవ్, లక్ష్మణ్ రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






