శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): భారత రాజ్యంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీకొల్లూరి భరత్ కుమార్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






