కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో విద్యార్థుల‌కు రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని కొండాపూర్ కొత్త‌గూడ కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో Arrive Alive రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల‌కు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ నియ‌మాల‌పై ట్రాఫిక్ పోలీసులు అవ‌గాహ‌న క‌ల్పించారు. ట్రాఫిక్ అధికారులు ఈ సంద‌ర్బంగా విద్యార్థుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో సైబారాబాద్ సీపీ పాల్గొని విద్యార్థుల‌తో మాట్లాడారు. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌తోపాటు ట్రాఫిక్ నియ‌మాల‌ను పాటించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను విద్యార్థుల‌కు వివ‌రించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రోడ్డు ప్రమాదాలపై వారి అనుభవాలను పంచుకోవాలని, తమకు లేదా వారి కుటుంబ సభ్యులకు ప్రమాదాలు ఎదురైన సందర్భాలు, వాటి ప్రభావాలను వివరించాలని కోరారు. అలాగే Cyber Towers వద్ద నిర్వహించిన మానవ హారం కార్యక్రమంలో కూడా సీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంప‌ల్లి ట్రాఫిక్ డీసీపీ, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, మాదాపూర్ లా అండ‌ర్ ఆర్డ‌ర్ ఏసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here