అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కార్య‌క్ర‌మ‌ వాల్ పోస్టర్ ను శేరిలింగంపల్లి మండల అగ్నిమాపక శాఖ అధికారి ఆంజనేయులుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణ కోసం, సురక్షితమైన పాఠశాల, ఆసుపత్రి, ఇతర ప్రాంతాలలో అగ్ని భద్రత పై అవగాహన కలిగిన సమాజం ఎంతో అవసరం అని అన్నారు. అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని అన్నారు. విద్యుత్ ప్రమాదలు జ‌రిగిన‌ప్పుడు నీటిని ఉపయోగించ‌రాద‌ని, పొడి ఇసుకను మాత్రమే వాడాలని తెలిపారు. అగ్నిప్రమాద అత్యవసర పరిస్థితులలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్‌టింగ్విష‌ర్ ను ఉపయోగించాలని, అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 101 టోల్‌ ఫ్రీ కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల రాజేందర్, కృష్ణా రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here