రాజ్యాంగాన్ని అందించ‌డం చాలా గొప్ప విష‌యం: తిప్పర్తి మహేష్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సంద‌ర్భంగా మియాపూర్ సర్కిల్ ఆల్విన్ కాలనీలో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ పాల్గొని అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ శ్రమించి భారత రాజ్యాంగాన్ని అందించడం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు త‌మ హ‌క్కుల‌తో ప‌నిచేస్తున్నారంటే అది అంబేద్క‌ర్ చ‌ల‌వే అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కొమ్ము పరమేష్, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు, నాయకులు కృష్ణయ్య, గురుచారం మహేష్, నాగరాజు, నాయక్, రమేష్, భిక్షపతి, భాస్కర్, పరమేష్, మల్లయ్య, దేవేందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here