శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): భారత రాజ్యంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.






