భెల్ టౌన్‌షిప్‌లో ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంబేద్కర్ జయంతి సందర్భంగా బీహెచ్ఈఎల్ అంబేద్కర్ భవన్ కమిటీ చైర్మన్, ఏజీఎం హరి రామకృష్ణ ఆధ్వర్యంలో టౌన్షిప్ లోని యూఆర్ఎస్ హాస్టల్ విద్యార్థులకు దుస్తులు, స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా హరి రామకృష్ణ తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ గౌడ్, సెలబ్రేషన్ కమిటీ చైర్మన్, ఆఫీసర్ శంకరయ్య భ‌వ‌న్ కమిటీ సభ్యులకు, విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హరి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా పేదల అభివృద్ధికి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. హ‌రి సింగ్, రవీందర్, దేవా, అర్జున్, సురేందర్, ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here