శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను రాజ్యాంగం ద్వారా అందించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.






