శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): ముజఫర్ అహ్మద్ నగర్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం బచ్చలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకుడు రాజేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మోహన్ ముదిరాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిరణ్ యాదవ్ హాజరయ్యారు. అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ ప్రభు, కాంగ్రెస్ నాయకుడు గంగాధర్, ఎంసిపిఐ రాష్ట్ర నాయకుడు అనిల్ కుమార్, యువ నాయకుడు తిరుపతి తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.






