శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి జనప్రియ నగర్ లోని పార్క్ లో ఓపెన్ జిమ్, ఒక బోర్ గురించి సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజనకి వినతి పత్రం అందజేశారు. ఆమె సానుకూలంగా స్పందించి మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కి ఉత్తరం పంపించారు. త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు.






