శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రసారం చేసిన సీవీఆర్ న్యూస్ చానల్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యానని హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. సీవీఆర్ చానల్ యాజమాన్యానికి ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించడం జరిగిందన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చెప్పిన మాటలను విని, జర్నలిజం విలువలను మరిచిపోయి అసత్య వార్తలను ప్రసారం చేసినందుకు సీవీఆర్ చానల్‌పై న్యాయ పోరాటం చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు.






