శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సత్య కీర్తి నృత్యధామం నాట్య గురువు బాలాజీ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గం గం గణపతి, బ్రహ్మాంజలి, గోవిందరాసిట, భావములోన, భజమానస, లింగాష్టకం, జావళి, రామాయణం, నారాయణతే నమో నమో, ఝేమ్ ఝేమ్ తనన, శివతాండవం, గరుడ గమన, కృష్ణం కలయసఖి అంశాలను కళాకారులు వర్షిణి, వేద్య, రియన్షిక, అన్విత, కాశి, ఉత్పల, శ్రీహ, ఆద్య రెడ్డి, హిమాన్షి, ఆశ్రిత, ద్రితి, నిహారిక, అనన్య ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నాట్య కళాకారిణి, సినిమా కథానాయిక లయ, పవన్ చౌదరి ముఖ్య అతిధులుగా హాజరై కళాకారులను అభినందించారు.






