ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఎస్‌ఆర్ శ్రీ గాయత్రి విద్యార్థులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ఎస్‌ఆర్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు విశిష్టమైన ప్రతిభ కనబరిచారు. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంపీఈసీ, సీఈసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో ఎ. శ్రీ యుక్త (469), డి. సాయి రోహిత్ (468), బి. సహస్ర (468), మహావీర్ (468), కె. ధ్యశ్విక (468), పి. జీవిత (468) అగ్రస్థానాల్లో నిలిచారు. బైపీసీ విభాగంలో జె. మహా (439), బి. సింధుబాయి (438), వి. శ్రీవాణి (438) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపీఈసీ విభాగంలో సవితా కుమారి, దివ్య కచావ్ (496) అత్యధిక మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో ఇ. శివలత, సభబియా ప్రవీణ్ (494) అగ్రస్థానాల్లో నిలిచారు. ఇతర అనేక మంది విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించి స‌త్తా చాటారు.

సీనియర్ ఇంటర్‌లో కూడా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో కె. రోహిణి, సి.హెచ్. ప్రియరెనా రూత్ (996), ఎమ్. స్నిగ్ధ, కె. శ్రీవల్లి (994) అద్భుత ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో జోబియా ఫాతిమా (994) ప్రతిభ చూపింది. ఎంపీఈసీ విభాగంలో పి. వికాస్ కుమార్ (992) మంచి ఫలితం సాధించాడు. సీఈసీ విభాగంలో రాశి కుమారి, ఎస్.డి. నజీన్ (981) విశిష్ట మార్కులు సాధించారు. ఇంకా అనేక మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, సూక్ష్మ ప్రణాళికతో బోధన అందించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సంస్థ డైరెక్టర్ ఎ. సంతోష్ రెడ్డి, డీజీఎం బి. భగవాన్ రెడ్డి, అకాడమిక్ డీన్ కె. శ్రీనివాస్, జోనల్ ఇన్‌చార్జ్‌ నరేష్, ప్రిన్సిపాళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here