వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను త్వ‌రగా పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని రామసముద్రం కుంట చెరువు నుండి గురునాధం చెరువు వరకు పునర్నిర్మాణం చేపట్టిన (Storm water drain) వరద నీటి కాలువ నిర్మాణం పనులను CMC అధికారులు, SNDP అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన పనులను పరిశీలించడం జరిగిందని, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులు త్వరలో పూర్తిచేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SNDP డీఈ ధీరజ్, CMC అధికారులు ఏఈ ప్రశాంత్, సరిత, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, నవీన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here